యశ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. ఇటీవల ఈ చిత్రంలోని 'తబాహి' పాటను విడుదల చేశారు. ఇందులో యశ్, కియారా అద్వానీ మధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా పెళ్లి తర్వాత ఇలాంటి సన్నివేశాల్లో నటించడమేంటంటూ కియారాపై పలువురు నెటిజన్లు ట్రోలింగ్ చేశారు. ఈ ట్రోలింగ్‌పై బ్రిటిష్ నటుడు బెనెడిక్ట్ స్పందిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. "యశ్ అద్భుతంగా కనిపించాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నవారే, కియారాపై మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? యశ్‌కు కూడా పెళ్లైంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరి నటీమణులనే ఎందుకు లక్ష్యంగా చేసుకుని ట్రోల్ చేస్తున్నారు? వాస్తవానికి వారు నటీనటులు. తెరపై కథ, పాత్రకు అనుగుణంగా నటించడమే వారి పని" అని ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
‘కియారాపై ట్రోలింగ్ సరికాదు’
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 17, 2026, 07:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)