శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

‘ఉపాధి’ వేతనాల చెల్లింపునకు రూ.402 కోట్లు

1 గంట క్రితం

upadi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 09:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విబి గ్రామ్‌ ‌జీ కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి విడత కేంద్ర సహాయం ద్వారా ఉపాధి హామీ వేతనదారుల వేతనాల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం రూ.402.56 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌ ‌దండే శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వులు ప్రకారం ఈ నిధులను డిబిటి-స్పర్శ్ విధానంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు వేతనాల చెల్లింపునకు వినియోగించనున్నారు. ఖజానా నియంత్రణ, త్రైమాసిక వ్యయ నియంత్రణ నిబంధనలకు సడలింపు ఇచ్చి, అదనపు గ్రాంట్లు మంజూరయ్యే వరకు ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నిధుల వినియోగం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం ఉండేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ పర్యవేక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే నిధుల వినియోగ ధ్రువీకరణ పత్రాలు సకాలంలో సమర్పించాలని సూచించింది. అధికారుల అనుమతి మేరకే ఈ నిధులు ఖర్చు చేయాలని, డ్రాయింగ్ ఆఫీసర్ రసీదు అందే వరకు తదుపరి బడ్జెట్ విడుదల ఉండదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్