సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విక్రమ్‌ కొత్త సినిమా ‘పవర్‌ హౌస్‌’

1 గంట క్రితం

vikram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 09:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చెన్నై: విలక్షణ నటుడు చియాన్‌ విక్రమ్‌ మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దర్శకుడు ఆనంద్‌ శంకర్‌ తెరకెక్కించనున్న ఈ చిత్రానికి ‘పవర్‌ హౌస్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సత్యజ్యోతి ఫిల్మ్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రియా శిబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విక్రమ్‌, ఆనంద్‌ శంకర్‌ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘ఇరుముగన్‌’ చిత్రానికి మంచి స్పందన లభించింది. మరోసారి వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. భారీ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాలో విక్రమ్‌ పాత్ర, కథాంశం ప్రత్యేకంగా ఉండనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ‘పవర్‌ హౌస్‌’తో విక్రమ్‌ మరో వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్న నేపథ్యంలో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్