వాషింగ్టన్: ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు టెహ్రాన్‌తో ఒప్పందం చేసుకోవడం తొందరపాటు అవుతుందని గత కొన్ని వారాలుగా చెబుతూ వచ్చిన ట్రంప్.. సోమవారం తన వైఖరిలో మార్పు సంకేతాలు ఇచ్చారు. ఇరాన్ ప్రభుత్వం త్వరగా ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా చర్చల్లో పాల్గొంటుందా లేదా అన్నది తానే నిర్ణయిస్తానని తెలిపారు. చర్చలకు అమెరికా సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఈ ఏడాదిలోనే ముగిసే అవకాశం ఉందని ట్రంప్ ఆదివారం తెలిపారు. నవంబర్‌లో అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల అనంతరం ఈ వ్యవహారం ముగిసే అవకాశం ఉందని, అంతకంటే ముందే ముగిసినా ఆశ్చర్యం లేదని అన్నారు. ఇరాన్ వ్యవహారం ముగిసిన అనంతరం చమురు ధరలు గణనీయంగా తగ్గుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలు వేగంగా పడిపోతాయని పేర్కొన్నారు.
ఇరాన్‌తో చర్చలకు సిద్ధం: ట్రంప్
56 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 14, 2026, 10:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)