బుధవారం, 07 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మార్చిలో ‘విశ్వంభర’

1 గంట క్రితం

మార్చిలో  ‘విశ్వంభర’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 07, 2026, 08:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చిరంజీవి కథానాయకుడిగా మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సంక్రాంతి విడుదల నుంచి తప్పుకుంది. సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలోని దృశ్యాలు, గ్రాఫిక్స్‌కు ఎక్కువ సమయం అవసరం కావడంతో విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చిలో శివరాత్రి సందర్భంగా సినిమాను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వి. వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, విక్రమ్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్