చిరంజీవి నటిస్తోన్న 'కాకా` మూవీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న మూవీని రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. దీంతో చిత్రయూనిట్ తాజాగా డబ్బింగ్ పనులను ప్రారంభించింది. దీనికి సంబంధించిన వీడియోను మూవీ టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో చిరంజీవి 'కదిరి కాళిదాస్`గా నటిస్తున్నారు. తన కూతురి పాత్రలో మలయాళ నటి అనస్వర రాజన్, భార్యగా ప్రముఖ నటి స్నేహ నటిస్తున్నారు. బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ, ఎన్‌కే లోహిత్ లు నిర్మిస్తున్నారు.
'కాకా` డబ్బింగ్ ప్రారంభం
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 07:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)