హీరో సందీప్ కిషన్, నటి ఫరియా అబ్దుల్లా నటించిన తాజా చిత్రం 'సిగ్మా`. ఈ మూవీతో తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు జేసన్ సంజయ్ దర్శకుడిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి నటి ఫరియా మీడియాతో మాట్లాడారు. ''సిగ్మా' నా మొదటి తమిళ చిత్రం. ఇది మంచి యాక్షన్-అడ్వెంచర్ హైస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్. ఈ సినిమాలో నేను రేడియో జాకీగా నటిస్తున్నాను. అలాగే నాకు సందీప్ ఎప్పటి నుంచో తెలుసు. మేమిద్దరం కలిసి ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. అది 'సిగ్మా`తో సాధ్యమైంది. ఈ సినిమాలో మా ఇద్దరి పాత్రల్లో చాలా కొత్తదనం ఉంటుంది` అని ఆమె అన్నారు. ఇక దర్శకుడు జేసన్ సంజయ్ గురించి మాట్లాడుతూ.. ' సంజయ్ నాకు ఈ సినిమా కథను జూమ్ కాల్ ద్వారా చెప్పారు. పూర్తి కథ విన్న తర్వాత, నేను అతని వయసు ఎంతో అడిగాను. అతను నాకు 24 ఏళ్లని చెప్పాడు. అది నాకు చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించింది. అతను అందరితో స్నేహపూర్వకంగా మెలుగుతాడు. అతనికి దర్శకత్వంపై మంచి పట్టు ఉంది. ఇది అతని మొదటి సినిమా అయినప్పటికీ, చాలా స్పష్టమైన విజన్‌తో దీనిని రూపొందించాడు. సెట్‌లో అతను వ్యవహరించే తీరు చాలా అద్భుతంగా ఉంటుంది` అని ఆమె అన్నారు.
'సిగ్మా`లో రేడియో జాకీగా ఫరియా
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 25, 2026, 07:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)