‘#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ రోహన్, ‘35 చిన్న కథ కాదు’ బాలనటుడు అరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘సమ్మర్ హాలిడేస్’ నుంచి ఫ్రెండ్‌షిప్ సాంగ్ విడుదలైంది. ‘ఓ రెండు తోక చుక్కలు.. తొడిగాయి చిన్ని రెక్కలు’ అంటూ సాగే ఈ పాటను చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది. సింజిత్ ఎర్రమల్లి సంగీతం అందించిన ఈ పాటను విశ్వదత్త ఆలపించారు. శ్రీకర్ నాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జయసుధ, వాసుకీ ఆనంద్, రాజీవ్ కనకాల తదితరులు నటిస్తున్నారు. బాల్యంలోని మధుర జ్ఞాపకాలు, అర్థవంతమైన సందేశంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు.
ఓ రెండు తోక చుక్కలు.. తొడిగాయి చిన్ని రెక్కలు...
9 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 06, 2026, 06:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)