మంగళవారం, 06 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కాంట్రాక్ట్‌ విధానంలోకి తాత్కాలిక ఉపాధ్యాయులు, అధ్యాపకులు

3 గంటల క్రితం

కాంట్రాక్ట్‌ విధానంలోకి తాత్కాలిక ఉపాధ్యాయులు, అధ్యాపకులు 
- డిబిఎఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వినయ్‌కుమార్‌ డిమాండ్‌
- 9వ రోజుకు చేరిన మహాధర్నా image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 11:50 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- డిబిఎఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వినయ్‌కుమార్‌ డిమాండ్‌

- 9వ రోజుకు చేరిన మహాధర్నా

ప్రజాశక్తి–అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిఆర్‌ అంబేద్కర్‌ గురుకుల విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సిబ్బందిని తక్షణమే కాంట్రాక్ట్‌ విధానంలోకి మార్చి, అనంతరం రెగ్యులర్‌ చేయాలని దళిత బహుజన ఫ్రంట్‌ (డిబిఎఫ్‌) వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వినయ్‌కుమార్‌, ‌రాష్ట్ర నాయకులు టి చెంగలరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విజయవాడ ధర్నాచౌక్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగులు నిర్వహిస్తున్న మహాధర్నా మంగళవారం 9వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మహాధర్నాకు మద్దతు తెలిపారు. విశ్వ కళా మండలి అధ్యక్షులు, వ్యవస్థాపకులు కుటుంబరావు మహాధర్నాకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వినయ్‌ ‌కుమార్‌ మాట్లాడుతూ.. ఒకే విద్యాసంస్థల్లో ఒకే రకమైన విధులు నిర్వహిస్తున్నప్పటికీ ఉద్యోగులను రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, పార్ట్‌టైమ్‌ అంటూ మూడు రకాలుగా విభజించడం అన్యాయమన్నారు. పార్ట్‌టైమ్‌ ఉపాధ్యాయులు, అధ్యాపకులను కాంట్రాక్ట్‌ విధానంలోకి మార్చడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. పార్ట్‌టైమ్‌ ఉద్యోగుల పోరాటానికి సమాజం అండగా ఉంటుందని, ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కోశాధికారి ఆంజనేయులు మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరడం పూర్తిగా న్యాయమైన డిమాండ్‌ అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. పార్ట్‌టైమ్‌ ఉద్యోగుల పోరాటానికి వ్యవసాయ కార్మిక సంఘం పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.కెవిపిఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ తాత్కాలిక ఉపాధ్యాయులు, అధ్యాపకుల విషయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పట్ల నిర్లక్ష్యం చూపుతోందన్నారు. కాంట్రాక్ట్‌, రెగ్యులర్‌ ఉద్యోగులకు కల్పిస్తున్న సౌకర్యాలను తాత్కాలిక ఉద్యోగులకు కల్పించడం లేదన్నారు. ఎస్‌‌సి,ఎస్‌‌టి ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు ఎవి రాజు మహాధర్నాకు మద్దతు తెలిపారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. మహాధర్నాలో అసోసియేషన్‌ నాయకులు మున్నెల్లి గురురత్నం, మురగారెడ్డి, యేసోబు, ఇస్మాయేలు, వర్మ, చినబాబు, అనిల్‌కుమార్‌, జ్యోతి, సునీత, గిరిజ, గోవిందు, కోటేశ్వరరావు, నారాయణ, శివ, శ్యాము, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్