సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘యాలాలో.. యాలాలో’ పాట విడుదల

3 గంటల క్రితం

song
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 10:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ నటుడు రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఇప్పటికే ‘ఇరుముడి కట్టు’ పాటను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ‘యాలాలో.. యాలాలో’ అనే మరో గీతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ పాటలో తండ్రీ–కూతుళ్ల మధ్య అనుబంధాన్ని హృద్యంగా ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆటో నడిపే మధ్యతరగతి వ్యక్తిగా రవితేజ కనిపించనున్నారు. హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్‌, చిన్నారి పాత్రలో నక్షత్ర నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్