ఆదివారం, 13 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘రివ్యూలతో సినిమా స్థాయిని తగ్గించలేరు’

12 గంటల క్రితం

sas
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 12, 2026, 07:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

రివ్యూలతో సినిమాల స్థాయిని తగ్గించలేరని నిర్మాత ప్రణయ్‌ రెడ్డి అన్నారు. ఆయన ఇటీవల నిర్మించిన ‘రోమాంచకం’ సినిమా హిట్‌ టాక్‌ అందుకుంది. అయితే రివ్యూల్లో మాత్రం సినిమాను తక్కువ చేసి చూపించారని ఆయన అన్నారు. ప్రస్తుతం ప్రభాస్‌ నటిస్తున్న ‘స్పిరిట్‌’ చిత్రాన్ని ప్రణయ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ‘రోమాంచకం’పై వచ్చిన విమర్శలపై ఆయన స్పందిస్తూ.. ‘‘నిర్మాణ రంగంలో ఉన్నవారికే ఆ కష్టాలు తెలుస్తాయి. రచయిత రాసిన ఓ కథను తెరపైకి తీసుకురావడానికి దర్శకుడు ఎంత కష్టపడతాడో.. షూటింగ్‌ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో అందరికీ అర్థం కావు. ‘రోమాంచకం’ సినిమా విడుదలైనప్పుడు రివ్యూల విషయంలో కొందరు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు వ్యవహరించారు. అది సరైనది కాదు. నిజంగా వారికి అంత సామర్థ్యం ఉంటే.. రాబోయే ‘స్పిరిట్‌’ మూవీని రివ్యూల ఆధారంగా దాని స్థాయిని తగ్గించగలరా?’’ అని ఆయన సవాల్‌ విసిరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్