ఇస్లామాబాద్ : పాకిస్తాన్‌లో సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌లో 12 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో కలత్ జిల్లాలో బుధవారం ఈ ఆపరేషన్ జరిగిందని సైన్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా సిబ్బంది ఒక ఉగ్రవాద స్థావరాన్ని గుర్తించి ధ్వంసం చేసారని, ఈ క్రమంలో 12 మంది ఉగ్రవ హతమయ్యారని ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఆ ప్రదేశంలో భారీగా ఉన్న మందుగుండు సామగ్రి, పేలుడు పదార్థాలను కూడా ధ్వంసం చేశామని వెల్లడించింది. ఈ ప్రాంతంలో ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారనే సందేహంతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు సైన్యం వెల్లడించింది.
పాక్‌లో 12 మంది ఉగ్రవాదుల హతం
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 04, 2026, 10:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)