- రెండు క్షిపణులను గుర్తించిన రక్షణ శాఖ
దుబాయ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ మరోసారి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు యూఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇరాన్ నుంచి ప్రయోగించిన రెండు క్షిపణులను యూఏఈ రక్షణ వ్యవస్థలు గుర్తించినట్లు తెలిపింది. రెండు క్షిపణుల్లో ఒకటి యూఏఈ ప్రాదేశిక జలాల వెలుపల పడగా.. మరో క్షిపణి దేశ ప్రాదేశిక జలాల పరిధిలో పడినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా అప్రమత్తతను కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర అవగాహన ఒప్పందం (MoU) సోమవారంతో ముగిసింది. ఒప్పందం ముగిసిన నేపథ్యంలో తాజా క్షిపణి దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు, హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న అబుదాబి నేషనల్ ఆయిల్ నౌకపై కూడా దాడి జరిగినట్లు సమాచారం. ఈ పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.







కామెంట్‌లు (0)