శుక్రవారం, 18 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దక్ష‍ిణ ఫిలిప్పీన్స్‌లోని హైస్కూల్లో కాల్పులు .. ఒకరు మృతి

1 గంట క్రితం

southern Philippines
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 03:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మనీలా : దక్ష‍ిణ ఫిలిప్పీన్స్‌లోని హైస్కూల్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా, నలుగురు గాయపడినట్లు ప్రావిన్స్‌ గవర్నర్‌ రేనాల్డో తమాయో శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సౌత్‌ కోటబాటోలోని బంగా పట్టణంలోని హైస్కూల్‌లో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించారు. అయితే కాల్పులు జరిపిన వ్యక్తి, బాధితుల వివరాలను వెల్లడించలేదు. ఆ ప్రాంతంలో కాల్పులు జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు.

గత నెల జంబోవాంగాలోని ఒక తరగతి గదిలో ఒక విద్యార్థి మరో విద్యార్థిని కాల్చి చంపడాన్ని ప్రత్యక్ష‍ ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆ విద్యార్థి కూడా కాల్చుకుని మరణించాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్