సోమవారం, 21 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Nepal floods : 538కి చేరిన మృతులు.. 1400మందికి పైగా గల్లంతు

28 ఆగస్టు, 2026

Death toll
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 04:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఖాట్మాండు : నేపాల్‌ వరదల్లో మృతుల సంఖ్య 538కి చేరింది. వందలాది మంది విదేశీయులతో కలిపి సుమారు 1400మందికి పైగా గల్లంతయ్యారని నేపాల్‌ పోలీసులు వెల్లడించారు. నేపాల్‌లోని ప్రభావిత ప్రాంతంలో శుక్రవారం ఉదయం అధికారులు తాజాగా మరో వరద హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతంలో రెండు సరస్సుల్లోనూ నీరు పూర్తిగా ఖాళీ అయ్యేంత వరకు వరద ముప్పు ఉంటుందని నేపాల్‌ విపత్తు నిర్వహణ సంస్థ అధికారి ఒకరు పేర్కొన్నారు. శుక్రవారం ఒక సరస్సులో నదీ ప్రవాహం పెరిగినట్లు తెలిపారు. టిబెట్‌ వైపున ఉన్న ఆనకట్ట ఒకటి మరోసారి తెగిపోయిందన్న సమాచారంతో అప్రమత్తమైనట్లు నేపాల్‌ పోలీసులు తెలిపారు. గిరోంగ్‌ సరిహద్దు కేంద్రానికి ఎగువన ఉన్న ఆనకట్ట వలన ఏర్పాటిన సరస్సులో నీటి ప్రవాహం పెరిగిందని చైనా మీడియా కూడా హెచ్చరించింది.


దేశంలో వచ్చిన భారీ వరదల నేపథ్యంలో.. ఒక నెల జీతాన్ని ప్రధాని విపత్తు సహాయ నిధికి అందించనున్నట్లు నేపాల్ ప్రధాని బాలేంద్ర షా, ఆయన మంత్రివర్గం ప్రకటించింది. సహాయక చర్యలు కోసం ఇతర దేశాల సాయం అవసరం లేదని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్