ఆదివారం, 23 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

బంగాళాఖాతంలో మునిగిన నౌక కోసం గాలింపు ముమ్మరం

1 గంట క్రితం

M.V
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 12:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

భువనేశ్వర్‌ : బంగాళాఖాతంలో మునిగిపోయిన పనామా జెండా కలిగిన ‘ఎం.వి. ఓషన్‌ విన్నర్‌’ నౌక కోసం గాలింపు, సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు భారత తీర రక్షక దళం (ఐసిజి) ఆదివారం తెలిపింది. ఆగస్టు 20న పారాదీప్‌ నుంచి సింగపూర్‌ వెళ్తుండగా 24 మంది సిబ్బందితో నౌక మునిగిపోయింది. ఇందులో 20 మంది చైనీయులు, ముగ్గురు మయన్మార్‌ పౌరులు, ఒక బంగ్లాదేశ్‌ పౌరుడు ఉన్నారు. ఈ నౌక ఒడిశా నుండి ఇనుప ఖనిజాన్ని తీసుకువెళుతోంది. సమాచారం అందుకున్న ఐసిజి, గాలింపు కోసం ‘ఎంటీ ఐసోపోస్‌’ వాణిజ్య నౌకను మళ్లించింది. ఆగస్టు 22 రాత్రి రెండు లైఫ్‌రాఫ్ట్‌ల నుంచి ఇద్దరు సిబ్బందిని రక్షించినట్లు తెలిపింది. మిగిలిన వారి కోసం వరద్‌, అన్మోల్‌, విజిత్‌ నౌకలు గాలింపు కొనసాగిస్తున్నాయి. ఆ నౌక చివరిగా 317ఈస్ట్ ఐలాండ్ ఎల్టి 310నాటికల్ మైళ్ల వద్ద ఉన్నట్లు తెలిసింది. 1998లో నిర్మించిన ఈ బల్క్‌ క్యారియర్‌ సుమారు 73 వేల టన్నుల సరుకును మోయగలదు. ఈ నౌక మొత్తం పొడవు (ఎల్‌ఒఎ) 225మీటర్లు, వెడల్పు 32.26మీటర్లు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్