శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇమ్రాన్‌ఖాన్‌ను తిరిగి జైలుకి తరలించిన పాక్‌ ప్రభుత్వం

1 గంట క్రితం

Imran Khan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 06:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను వైద్య పరీక్ష‍ల అనంతరం తిరిగి జైలుకి తరలించినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రైవేట్ క్లినిక్ వద్ద ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారుల కారణంగా తలెత్తిన "భద్రతా పరిస్థితుల"దృష్ట్యా.. ఆయనను ఇస్లామాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి 'పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్' (పిఐఎంఎస్‌)కు తరలించినట్లు సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ ఎక్స్‌ పోస్ట్‌లో తెలిపారు. కంటి, గుండె వైద్య నిపుణులతో పాటు నిపుణులైన వైద్య బృందం అన్ని వైద్య పరీక్ష‍లు నిర్వహించిందని అన్నారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారని, దీంతో వైద్య ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయనను తిరిగి రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించామని అన్నారు. వైద్య పరీక్ష‍ల సమయంలో ఇమ్రాన్‌ సోదరి ఉజ్మాఖాన్‌ కూడా అక్కడే ఉన్నారని అన్నారు.

ఈ ఏడాది ప్రారంభంలో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కుడి కంటి చూపు పూర్తిగా క్ష‍ీణించిందని కుటుంబసభ్యులు, న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనను షిఫా ఇంటర్నేషనల్‌ ఆస్పత్రికి తరలించాల్సిందిగా కోర్టు ఆదేశించింది. అయితే పెద్ద ఆయన మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు ఉన్నారన్న సాకుతో పాక్‌ ప్రభుత్వం ఆ ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు నిరాకరించింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్