మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‌ఆరుగురు సభ్యుల కుటుంబాన్ని బలిగొన్ని ఇజ్రాయిల్‌

2 గంటల క్రితం

gaza
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 11:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • గాజాపై కొనసాగుతున్న అమానవీయ దాడులు

గాజా : 9ఇజ్రాయిల్‌ అమానవీయ దాడులకు గాజాలో మరో నిండు కుటుంబం బలైపోయింది. గాజా నగరంలో మంగళవారం ఇజ్రాయిల్‌ ‌జరిపిన వైమానిక దాడిలో ఆరుగురు సభ్యులున్న ఒక కుటుంబం మరణించిందని ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. సాబ్రా ప్రాంతంలోని అల్‌ ‌మస్రి కుటుంబ నివాసంపై ఈ దాడి జరిగింది. తల్లీదండ్రి నలుగురు పిల్లలు నిద్ర పోతుండగా జరిగిన దాడిలో వారు మరణంచారని చెప్పారు. 9 మాసాల క్రితం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత ఇజ్రాయిల్‌ ‌వరుసగా జరుపుతున్న దాడుల్లో ఇప్పటివరకు 1150 మంది మరణించారు. ఈ ఒప్పందం వల్ల పూర్తి స్థాయిలో దాడులు నిలిచాయి కానీ ఇజ్రాయిల్‌ ‌మాత్రం దాదాపుగా రోజు ఏదో ఒక రకంగా దాడులు చేస్తూనే వుంది. ఇజ్రాయిల్‌ ‌మిలటరీ కూడా ఈ దాడిని ధృవీకరించింది. హమాస్‌ ‌సభ్యుడిని తాము లక్ష్యంగా చేసుకున్నామని తెలిపింది. కాగా ఐక్యరాజ్యసమితి గాజాలో కొనసాగుతున్న దాడులను ఖండించింది. 9 మాసాలైనా ఇంకా గాజాలో పాలస్తీనియన్లకు ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం ప్రతినిధి తమీన్‌అల్‌ ‌ఖీతా మంగళవారం జెనీవాలో విలేకర్లతో వ్యాఖ్యానించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్