శనివారం, 18 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మెక్సికోలో 7.3 తీవ్రత భారీ భూకంపం

1 గంట క్రితం

earth quke
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 07:12 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మెక్సికో దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. గ్వాటెమాలా సరిహద్దుకు సమీపంలో చోటుచోసుకున్న ఈ భూప్రకంపనల ప్రభావం మెక్సికో సిటీతో పాటు ఎల్ సాల్వడార్ వరకు విస్తరించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం, రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. చియాపాస్ తీరానికి సమీపంలోని అఖిలెస్ సెర్డాన్‌కు నైరుతి దిశగా 48 కిలోమీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ప్రధాన భూకంపానికి ముందు సముద్ర గర్భంలో స్వల్ప స్థాయిలో ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్