- ఒక దేశంపై దాడి అంటే మూడింటిపై దాడిగానే పరిగణన
మక్కా: పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు కొత్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం, మూడు దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా దానిని మూడు దేశాలపై జరిగిన దాడిగా పరిగణించనున్నట్లు ప్రకటించాయి. మక్కాలో నిర్వహించిన 'జాయింట్ డిఫెన్స్ మక్కా అల్-ముఖర్రమా' శిఖరాగ్ర సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేసినట్లు మూడు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు వెల్లడించాయి. సంయుక్త ప్రకటన ప్రకారం, ప్రాంతీయ భద్రతను బలోపేతం చేయడం, ఏ విధమైన దాడినైనా సామూహికంగా ఎదుర్కోవడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశమని తెలిపాయి. అలాగే పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా, ముఖ్యంగా ఇరాన్‌కు సంబంధించిన పరిస్థితుల్లో మధ్యవర్తిత్వానికి కూడా మూడు దేశాలు చొరవ తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి.








కామెంట్‌లు (0)