సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నేపాల్‌లో మత ఘర్షణలు

1 రోజు క్రితం

nepal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 02, 2026, 06:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- ముగ్గురు మృతి, మూడు జిల్లాల్లో కర్ఫ్యూ

- భారత్‌ ‌సరిహద్దుల్లో ఉద్రిక్తత

​ఖాడ్మాండు : భారత్‌ ‌నేపాల్‌ ‌సరిహద్దు జిల్లాల్లో మత ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. దీంతో అధికారులు కర్ఫ్యూ విధించారు.

గతవారం సున్సారి జిల్లాలో మొదలైన హింస సమీపంలోని సిరాహాకు వ్యాపించడంతోపాటు, సప్తారీ, ధనుషా జిల్లాల్లో నిరసనలు, ఆంక్షలకు దారితీసిందని నేపాల్‌ ‌మీడియా సంస్థలు నివేదించాయి.

​ఏం జరిగింది?

బీహార్ సరిహద్దుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సున్సారి జిల్లా దేవాన్‌గంజ్ రూరల్ మున్సిపాలిటీలోని కప్తాన్‌గంజ్ మార్కెట్ ప్రాంతంలో గత వారం ఒక మతపరమైన ఊరేగింపు విషయమై రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. బిగ్గరగా సంగీతం వినిపించడంపై ఒక వర్గం అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదం మొదలై, తర్వాత రాళ్ల దాడికి దారితీసింది. అనంతరం పోలీసులు మూకను చెదరగొట్టేందుకు గాల్లో కాల్పులు జరిపారు. అయితే, కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ, జూలై 30న సిరాహాలోని గోల్‌బజార్‌లో మళ్లీ చెలరేగిన ఘర్షణల్లో మరో వ్యక్తి మృతి చెందారు. దీంతో ఘర్షణలు ఇతర ప్రాంతాలకు విస్తరించడంతో పోలీసలు కర్ఫ్యూను కొనసాగిస్తున్నామని తెలిపారు. దేశ జనాభాలో మైనార్టీలు సుమారు 5 శాతమే ఉన్నప్పటికీ సున్సారి, ధనుషా, పర్సా, సర్లాహి వంటి తరాయ్ జిల్లాల్లో మైనార్టీలే లక్ష్యంగా దాడులు జరగుతున్నాయి. దీనిపై ప్రధాన మంత్రి బలేంద్ర శా, ప్రజలు ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తు చేపట్టి బాధ్యులను శిక్షిస్తామని ఆయన ప్రకటించారు. దీంతోపాటు మృతి చెందిన కుటుంబాలను 8 లక్షల నేపాలీ రూపాయల పరిహారం ప్రకటించారు. అలాగే, ప్రతిపక్ష పార్టీలు, మధేశ్ ప్రాంత నేతలు కూడా రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అయితే

2015లో లౌకిక గణతంత్ర రాజ్యంగా ఏర్పడినాటి నుండి మత ఘర్షణలు తగ్గాయి. కానీ, ఇటీవల దేశంలో వచ్చిన రాజకీయం మార్పులతో రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ వంటి మితవాద శక్తులు ప్రజల్లో వైషమ్యాలు పెంచుతున్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్