శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

భారత్‌‌ నుండి శరణార్ధులను రప్పించేందుకు శ్రీలంక చర్యలు భేష్‌ : ఐరాస

1 గంట క్రితం

uno
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 23, 2026, 12:01 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

కొలంబో : భారత్‌‌ నుండి శరణార్ధులు స్వచ్ఛందంగా తిరిగి వచ్చే ప్రక్రియను వేగిరపరిచేందుకు ఇమ్మిగ్రేషన్‌ పద్దతులను సరళీకరించాలని శ్రీలంక తీసుకున్న నిర్ణయాన్ని ఐక్యరాజ్య సమితి శనివారం స్వాగతించింది. వీరందరూ శ్రీలంకలో దశాబ్దాలుగా కొనసాగిన అంతర్యుద్ధం సమయంలో సరైన పత్రాలు లేకుండా దేశం విడిచి వచ్చిన శరణార్ధులు. ఈ చొరవ కోసం ఈ నెల ఆరంభంలో శ్రీలంక ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. 1983లో శ్రీలంకలో జాతుల మధ్య ఘర్షణ, హింస ప్రారంభమైన తర్వాత పెద్ద సంఖ్యలో శ్రీలంక శరణార్ధులు తమిళనాడు రావడం ఆరంభించారు. ఆ తర్వాత శ్రీలంక ప్రభుత్వం, ఎల్‌‌టిటిఇ మద్య చెలరేగిన సాయుధ ఘర్షణలతో పరిస్థితులు మరింత క్షీణించాయి. దాదాపు మూడు దశాబ్దాల పాటు ఈ పరిస్థితులు కొనసాగాయి. 2002-2022 మధ్య కాలంలో దాదాపు 18వేల మంది స్వదేశానికి తిరిగి వచ్చారు. కానీ ఇంకా 90వేల మందికి పైగా భారత్‌‌లోనే వున్నారు. వీరిలో చాలామంది తిరిగి రావడానికి అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీలంక తీసుకున్న నిర్ణయంతో ఐక్యరాజ్య సమితి హర్షం వ్యక్తంచేసింది. యుఎన్‌‌హెచ్‌‌సిఆర్‌ ‌ద్వారా ఈ శరణార్ధుల తరలింపు ప్రక్రియ, అక్కడ పునరావాసం ఏర్పాట్లు జరుగుతాయని శ్రీలంకలో యుఎన్‌ ‌సెక్రటరీ జనరల్‌ ‌ప్రతినిధి మార్క్‌ అండ్రె తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్