జెనీవా : ఏడాదిలో సుమారు 2కోట్ల మంది చిన్నారులు డిజిటల్ లైంగిక వేధింపుల బారిన పడినట్లు యునిసెఫ్ తెలిపింది. వీరంతా 12 నుండి 17ఏళ్ల లోపు వయస్సు వారేనని పేర్కొంది. ‘‘పిల్లల కళ్ళతో: డిజిటల్ సాంకేతికతలు పిల్లలపై లైంగిక వేధింపులకు ఎలా దారితీస్తాయి ’’ అనే శీర్షికతో యునిసెఫ్ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. 21 దేశాలలో ఒకే సంవత్సరంలో 12 నుండి 17 ఏళ్ల వయస్సు గల సుమారు 2 కోట్ల మంది పిల్లలు సాంకేతికత ఆధారిత (డిజిటల్ మాధ్యమాల ద్వారా) లైంగిక వేధింపుల బారిన పడినట్లు తెలిపింది. ఈ పరిశోధనల ప్రకారం, 1.5కోట్లమంది చిన్నారులు తమకు ఇష్టం లేకుండానే లైంగిక కంటెంట్‌ను పొందారని, 90 లక్షల మంది తమ ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక సంభాషణలు లేదా చిత్రాల కోసం అభ్యర్థనలను అందుకున్నారని, సుమారు 40 లక్షల మంది లైంగిక చిత్రాలు వారి సమ్మతి లేకుండా పంపిణీ అయినట్లు వెల్లడైంది. సుమారు 60శాతం కేసుల్లో డిజిటల్ మాధ్యమాలైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్, వాట్సప్‌ల ద్వారా ఇటువంటి కంటెంట్‌ను పొందగా, సుమారు 14శాతం మంది ఆన్‌లైన్ గేమ్స్‌ల ద్వారా పొందినట్లు నివేదిక తెలిపింది. పిల్లల విశ్వాసాన్ని దుర్వినియోగం చేయడానికి ప్లాట్‌ఫామ్ ఫీచర్లు, డిజైన్స్ రూపొందించారని పేర్కొంది. 57 శాతం కేసుల్లో వేధింపులకు పాల్పడిన వారు ఆ పిల్లలకు అప్పటికే తెలిసిన వ్యక్తులైన ఇతర మైనర్లు, ప్రేమ సంబంధం ఉన్నవారు, స్నేహితులు లేదా కుటుంబ సభ్యులు అయి ఉన్నారని నివేదిక తెలిపింది. 38శాతం కేసుల్లో వేధింపులకు పాల్పడిన వ్యక్తితో మొదటి పరిచయం ఆన్‌లైన్‌లోనే జరిగిందని, ఇది తరచుగా నకిలీ ఖాతాలు, ప్రైవేట్ మెసేజింగ్ ఫీచర్ల ద్వారా జరిగినట్లు వెల్లడించింది.
డిజిటల్ లైంగిక వేధింపుల బారిన 2 కోట్ల మంది మైనర్లు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 03:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)