మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పదవి నుంచి వైదొలగనున్న వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్

13 ఆగస్టు, 2026

white house
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 13, 2026, 07:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్‌

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అత్యంత విశ్వసనీయ సహాయకుల్లో ఒకరైన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ తన పదవి నుంచి వైదొలగనున్నారు. ఆగస్టు నెలాఖరులో ఆమె బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు ట్రంప్ ప్రకటించారు. 28 ఏళ్ల కరోలిన్ లీవిట్ అమెరికా చరిత్రలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. రెండోసారి తల్లి అయిన అనంతరం ఇటీవలే ప్రసూతి సెలవు నుంచి వైట్ హౌస్‌కు తిరిగి వచ్చిన ఆమె.. తన పిల్లలతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పదవీకాలం పూర్తి చేయకుండానే ఆమె వైదొలుగుతున్నారు. ఈ ఖాళీకి ఎవరిని నియమిస్తారనేది వెల్లడించలేదు.

కరోలిన్ లీవిట్ ట్రంప్ తొలి అధ్యక్ష పదవీకాలంలో వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా పనిచేశారు. అనంతరం న్యూయార్క్‌కు చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యురాలు ఎలిస్ స్టెఫానిక్‌కు కమ్యూనికేషన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2022లో న్యూ హాంప్‌షైర్‌లోని కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె.. ప్రైమరీలో గెలిచినా సాధారణ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి క్రిస్ పప్పాస్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ట్రంప్‌కు మద్దతు ఇచ్చే మాగా ఇంక్.కు ప్రతినిధిగా పనిచేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ప్రచారానికి జాతీయ ప్రెస్ సెక్రటరీగా వ్యవహరించారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, జనవరి 2025లో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీగా నియమితులయ్యారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్