సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionహెచ్‌డిఎఫ్‌‌సి బ్యాంక్ ఎండికి రూ. లక్ష జరిమానా

1 గంట క్రితం

HDFC-Bank-Logo
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 09:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి: మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఎస్‌ఆర్‌‌డిసి) డిపాజిట్ల సేకరణ వ్యవహారంలో ఆర్‌బిఐ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై దేశంలోని అతిపెద్ద ప్రయివేటు రంగ బ్యాంకైన హెచ్‌డిఎఫ్‌‌సి బ్యాంక్ ఎండి, సిఇఒ శశిధర్ జగదీశన్, సిఎఫ్‌ఒ శ్రీనివాసన్ వైద్యనాథన్, రిటైల్ అసెట్స్ గ్రూప్ హెడ్ అరవింద్ వోహ్రాకు బోర్డు హెచ్చరిక లేఖలు జారీ చేసింది. ఒక్కొక్కరికి రూ. 1 లక్ష చొప్పున జరిమానా విధించింది. జులై 23న జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ బ్యాంక్‌ బోర్డు వెల్లడించింది. ఉద్యోగుల ప్రవర్తనలో ఎలాంటి దురుద్దేశాలు లేవని పేర్కొంది. 2017, 2021 సంవత్సరాల్లో ఎంఎస్‌ఆర్‌‌డిసి నుంచి డిపాజిట్లను సమీకరించే విషయంలో జరిగిన ఒప్పందాలపై ఈ అంతర్గత విచారణ సాగగా.. అక్టోబర్‌లో ఎండి పదవీకాలం ముగియనున్న తరుణంలో బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్