సోమవారం, 27 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపిహెచ్‌‌సిల పనితీరుకు ‘ఆరోగ్య ఫలితాలే’ ప్రామాణికం : మంత్రి

1 గంట క్రితం

satyakumar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 27, 2026, 10:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పిహెచ్‌‌సిల పనితీరుకు ‘ఆరోగ్య ఫలితాలే’ ప్రామాణికమని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. పిహెచ్‌‌సిల పరిధిలో నమోదయ్యే టీనేజ్‌ గర్భధారణలు, హైరిస్క్ గర్భిణుల నమోదు, గర్భధారణ కాలంలో అందించే వైద్య సేవలు, ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు, సిజేరియన్ ప్రసవాల శాతం, మొత్తం సంతానోత్పత్తి రేటు, మాతృ మరణాల నియంత్రణను పరిగణనలోకి తీసుకోనున్నారని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాతా, శిశు ఆరోగ్యం నుంచి ప్రజల సంతృప్తి వరకు 21 అంశాల ప‌నితీరు ఆధారంగా మార్కులు, కొత్త ర్యాంకింగ్‌లో ఇవి అత్యంత కీలకం కానున్నాయన్నారు. మాతృత్వ మరణాలు, సిజేరియన్లు తగ్గిన ఆస్పత్రులకు ర్యాంకింగ్‌లో ప్రాధాన్యతనిస్తారని తెలిపారు. పిహెచ్‌‌సిల్లో వైద్య సేవలు పొందిన ప్రజలు ఐవిఆర్‌ఎస్ ద్వారా తెలియజేసే అభిప్రాయాన్ని ర్యాంకింగ్‌లో భాగం చేశామని పేర్కొన్నారు. మొత్తం 21 కీలక పనితీరు సూచికల్లో ఒక్కో అంశానికి గరిష్టంగా ఒక పాయింట్ కేటాయిస్తారన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్