గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనేడు టాటా సన్స్ బోర్డు కీలక సమావేశం..

8 గంటల క్రితం

tata sons...jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 06:19 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : దేశీయ దిగ్గజ సంస్థ టాటా సన్స్ బోర్డు సమావేశం నేడు ముంబైలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌బిఐ) నిబంధనల ప్రకారం కంపెనీని స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయడం, ప్రస్తుత చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ పదవీకాలం ముగియనుండటంతో తదుపరి నాయకత్వ ఎంపిక, అలాగే టాటా ట్రస్ట్స్‌లో నెలకొన్న పాలనాపరమైన ప్రతిష్టంభన వంటి కీలక అంశాలపై సెప్టెంబర్‌ 17 నాటి భేటీలో చర్చించనున్నారు. టాటా సన్స్ నాన్‌-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ రిజిస్ట్రేషన్‌ను వదులుకోవాలన్న అభ్యర్థనను ఆర్‌బిఐ ఇటీవల తోసిపుచ్చడంతో, రూ. 1 లక్ష కోట్లకు పైగా ఆస్తులున్న ఈ సంస్థ లిస్టింగ్ ప్రణాళికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అలాగే, 2027 ఫిబ్రవరితో ఎన్ చంద్రశేఖరన్ టర్మ్ ముగియనుండగా, తదుపరి చైర్మన్ నియామకం కోసం ఏర్పాటు చేయాల్సిన సెక్షన్ కమిటీకి సర్ రతన్ టాటా ట్రస్ట్ (ఎస్‌ఆర్‌‌టిటి) బోర్డు సమావేశాల నిషేధం కారణంగా ఆటంకం ఏర్పడుతోంది. ఈ సమావేశంలో ఈ సమస్యలన్నింటిపై బోర్డు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది కార్పొరేట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్