మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఫ్రాంచైజీల విస్తరణపై యాక్టివ్‌.ఇన్‌ దృష్టి

3 గంటల క్రితం

active.in
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 09:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • ఏడాదిన్నరలో 15 అవుట్‌‌లెట్‌‌ల ఏర్పాటు లక్ష్యం

​ప్రజాశక్తి - హైదరాబాద్‌ : నగరానికి చెందిన ప్రముఖ విండోస్, ఫాసాడ్స్, హోమ్ ఆటోమేషన్ సంస్థ యాక్టివ్ గ్రీన్ ప్రొడక్ట్స్ (యాక్టివ్.ఇన్) ఫ్రాంచైజీలను పెద్ద మొత్తంలో విస్తరించడం ద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించాలని నిర్ణయించుకుంది. మంగళవారం హైదరాబాద్‌‌లో ఆ కంపెనీ ఎండి ముడునూరి వెంకట సుబ్బరాజు, సిఇఒ పోతురాజు శ్రీలక్ష్మి నరసింహారావు మీడియాతో మాట్లాడారు. వచ్చే రాబోయే 12-18 నెలల్లో దక్షిణాది రాష్ట్రాలతో పాటు భువనేశ్వర్‌లో 15 కొత్త ఫ్రాంచైజీ అవుట్‌లెట్లతో తన వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించారు. ఎపిలో నెల్లూరు, తిరుపతిలో, తెలంగాణలో వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌‌లో కొత్త ఫ్రాంచైజీలు తెరువాలని నిర్దేశించుకున్నామన్నారు. గతంలో 15 మంది ఉద్యోగులతో ప్రారంభమైన తమ సంస్థలో ప్రస్తుతం 400 మందికి పైగా సిబ్బంది పని చేస్తున్నారన్నారు. 2025-26లో రూ.187 కోట్ల టర్నోవర్‌ ‌సాధించగా.. ఈ ఏడాది 2026-27లో రూ.250 కోట్లు, వచ్చే మూడు, నాలుగేళ్లలో రూ. 1,000 కోట్ల రెవెన్యూ లక్ష్యంతో దూసుకెళ్తున్నామన్నారు. తెలంగాణలోని సుల్తాన్‌పూర్, పాశమైలారంలో ఉన్న ఉత్పత్తి యూనిట్లకు అదనంగా కర్ణాటకలో కొత్త తయారీ రంగాన్ని అందుబాటులోకి తెస్తోన్నామన్నారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను వేగంగా అందుకోవడానికే ఈ ప్రాంతీయ విస్తరణ చేపట్టామన్నారు. ఇప్పటికే రూ.100 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టామని.. మరో రూ.70 కోట్ల వరకు వ్యయం చేయనున్నామని చెప్పారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్