సినిమా రంగంలో సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, వర్చువల్ ప్రొడక్షన్, డిజిటల్ క్యారెక్టర్ల తర్వాత ఇప్పుడు కృత్రిమ మేధస్సు (ఏఐ) నేరుగా నటన రంగంలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్‌లో రూపొందుతున్న 'మిస్‌అలైన్డ్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందులో ప్రధాన పాత్రను పోషిస్తున్న టిల్లీ నార్వూడ్ అనే డిజిటల్ ఏఐ నటికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తిస్థాయి ఏఐ హీరోయిన్‌తో రూపొందుతున్న తొలి ప్రధాన చిత్రంగా ఇది ప్రచారం పొందుతోంది. 'పార్టికల్ 6' అనే ఏఐ ఆధారిత స్టూడియో ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
హాలీవుడ్‌లో చర్చగా ఏఐ హీరోయిన్
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 07, 2026, 09:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)