బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్యారెల్‌ చమురు @100 డాలర్లు

1 గంట క్రితం

crude
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 08:26 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం

న్యూఢిల్లీ : అమెరికా యుద్ధోన్మాదంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలు ప్రపంచ ప్రజలపై తీవ్ర ధరల భారాన్ని పెంచుతోంది. ఈ భౌగోళిక ఘర్షణలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. జులై 24 తర్వాత తొలిసారిగా ముడి చమురు ఫ్యూచర్స్ ధర బ్యారెల్ 100 డాలర్ల మార్కును దాటాయి. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, రవాణా మార్గాలకు ఎదురవుతున్న తీవ్ర ఆటంకాల కారణంగా చమురు సరఫరాపై ఆందోళనలు పెరిగాయి.

​బుధవారం బ్రెంట్ చమురు ఫ్యూచర్స్ 2.15 డాలర్లు లేదా 2.2 శాతం పెరిగి 100.07 డాలర్లకు చేరుకుంది. అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) చమురు 1.70 డాలర్లు పెరిగి 94.73 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత నెల ప్రారంభంతో పోలిస్తే బ్రెంట్ ధరలు సుమారు పావు వంతు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. అమెరికా యుద్ధ నౌకలపై దాడుల ప్రయత్నాలకు ప్రతిస్పందనగా ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లను లక్ష్యంగా చేసుకుంటామని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ భూభాగం నుంచి ప్రయోగించిన 20 బాలిస్టిక్ క్షిపణుల్లో 180 పైగా జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థ విజయవంతంగా అడ్డగించిందని ఆ దేశ సైనిక వర్గాలు తెలిపాయి.

​120 డాలర్లకు చేరొచ్చు..!

​పశ్చిమాసియాలో రవాణా మార్గాలపై దాడిల తీవ్రత పెరిగితే చమురు బ్యారెల్ ధర 120 డాలర్లకు చేరుకోవచ్చని గోల్డ్‌మన్ శాక్స్ హెచ్చరించింది. సరఫరాలో అంతరాయాల కాలపరిమితి మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్న జెపి మోర్గాన్ పేర్కొంది. ప్రతి నెలా ఈ ఆటంకాలు కొనసాగితే బ్రెంట్ ధర మరో 7 నుండి 8 డాలర్లు పెరిగే అవకాశం ఉందన్నారు. మూడు నెలలు కొనసాగితే సగటున 114 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. హర్మూజ్‌ జలసంధి పునరుద్ధరణ ఆలస్యం కానుండటంతో సిటీ బ్యాంక్ తన మూడో త్రైమాసిక అంచనాను 80 డాలర్ల నుంచి 86 డాలర్లకు సవరించింది. ఎఎన్‌‌జడ్‌ విశ్లేషకులు కూడా స్వల్పకాలిక బ్రెంట్ అంచనాను 95 డాలర్లకు పెంచారు. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే పూర్తి స్థాయి సరఫరా సాధారణ స్థితికి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్