హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026–27 ముగింపు నాటికి తన నిర్వహణలోని వాహనాల సంఖ్యను సుమారు 10,000కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బైక్‌వో గ్రీన్‌టెక్ వెల్లడించింది. ఇటీవల వారెంట్ల ద్వారా రూ.76 కోట్లకుపైగా నిధులు సమీకరించినట్లు తెలిపింది. అదే విధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బయో ఎనర్జీ విభాగంతో రూ.66.46 కోట్ల విలువైన ప్రత్యేక విద్యుత్ ట్రాక్టర్ల సరఫరా, లీజింగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆ కంపెనీ సీఈఓ హిటెన్ పాల్ సక్లానీ తెలిపారు. ఈ ఒప్పందం జులై 2033 వరకు అమల్లో ఉంటుందన్నారు.
10,000 వాహనాల నిర్వహణ లక్ష్యం : బైక్‌వో వెల్లడి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 10:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)