శుక్రవారం, 21 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సెంట్రల్ బ్యాంక్ మెగా రిటైల్ అవుట్‌రీచ్

1 గంట క్రితం

business
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 21, 2026, 08:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- రూ. 172 కోట్ల రుణాలు మంజూరు

ప్రజాశక్తి - హైదరాబాద్‌ : రిటైల్ రుణ వ్యాపారాన్ని బలోపేతం చేయడం, ఖాతాదారులతో సంబంధాలను మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వ రంగంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ రీజియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మెగా రిటైల్ అవుట్‌రీచ్’ కార్యక్రమం విజయవంతమైంది. కార్పొరేట్ ఆఫీస్ జనరల్ మేనేజర్ ఎ.డి. శ్రీనివాస్, రీజినల్ హెడ్ గజేంద్ర సింగ్ చౌహాన్ హాజరైన ఈ వేదికపై గృహలక్ష్మి, హోమ్, గోల్డ్, వెహికల్ లోన్లపై పరిశ్రమలో అత్యంత పోటీ వడ్డీ రేట్లను అందిస్తున్నట్లు ప్రకటించారు. బలమైన సీఏఎస్‌ఏ బేస్ కలిగిన తమ బ్యాంకు ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, ఈ ప్రచార కాలంలో ఇన్ ప్రిన్సిపల్ ఆమోదాలతో కలిపి మొత్తం రూ. 172 కోట్ల రుణాలు మంజూరు చేయగా.. రూ. 125 కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. అదనంగా రూ. 24 కోట్ల లీడ్స్ సేకరించినట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్