న్యూఢిల్లీ : తేనె, ఆవు నెయ్యి, వంట నూనెలు వంటి ఆహార ఉత్పత్తులపై ‘100 శాతం స్వచ్ఛమైనది, సహజమైనది’ అంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తుండటంతో ప్రముఖ సంస్థ డాబర్ ఇండియాపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ) కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు తేనె, ఆపిల్ సైడర్ వెనిగర్, వర్జిన్ కోకోనట్ ఆయిల్, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, కొబ్బరి నీళ్లు తదితర ఉత్పత్తులను 100 శాతం నినాదాలతో విక్రయించడాన్ని నిషేధిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ వెల్లడించింది. కంపెనీ వెబ్‌సైట్‌లో విక్రయిస్తున్న ఉత్పత్తులపై 100 శాతం ప్యూర్, 100 శాతం నాచురల్, 100 శాతం ఆర్గానిక్ వంటి నినాదాలు నిబంధనలకు విరుద్ధంగా, వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని స్పష్టం చేసింది.
డాబర్ 100 శాతం స్వచ్ఛతపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ ఆగ్రహం
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 04, 2026, 09:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)