గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కార్వ్ ఐటీకి భారీ పెట్టుబడులు

1 రోజు క్రితం

business
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 09:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - హైదరాబాద్‌ : తెలుగు పారిశ్రామికవేత్త రఘునాథ్ రప్పిన్ స్థాపించిన కార్వ్ ఐటీ సంస్థకు దుబాయ్‌లో జరిగిన ‘ఐసిఐఇ డీల్ రూమ్’ కార్యక్రమంలో 4 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.38 కోట్లు)పెట్టుబడులు సమీకరించింది. హెల్త్‌టెక్ రంగంలో సంస్థ విస్తరణకు ఈ పెట్టుబడి కీలకంగా మారనుందని కంపెనీ పేర్కొంది. సందీప్ మక్తల మార్గదర్శకత్వంలో కేవలం 30 రోజుల్లో ఈ పెట్టుబడిని సమీకరించడం విశేషంగా నిలిచింది. సందీప్ మక్తల ఆధ్వర్యంలో జరిగిన ఎక్స్‌ప్లోర్ టు ఎక్స్‌పాండ్ వ్యాపార పర్యటనల ద్వారా రఘునాథ్ అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులను, ప్రభుత్వ ప్రతినిధులను సంప్రదించే అవకాశం పొందారు. ఈ సందర్భంగా రఘునాథ్ రప్పిన్ మాట్లాడుతూ.. ‘గత రెండేళ్ల నా కఠిన శ్రమకు సందీప్ మక్తల అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వానికి దక్కిన ఫలితమే ఈ పెట్టుబడి. ఆయన కల్పించిన ప్రపంచ స్థాయి వేదికలు నా వ్యాపార ఆలోచనను విజయవంతం చేశాయి.’ అని భావోద్వేగంతో పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్