గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నా కొడుకు గర్వపడే సినిమాలే చేస్తా : కాజల్​

1 రోజు క్రితం

kajal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 08:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

తల్లి అయిన తర్వాత తన సినీ కథల ఎంపిక విధానం పూర్తిగా మారిపోయిందని ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌, వ్యక్తిగత విషయాలపై మాట్లాడారు. ‘నేను తల్లి అయిన తర్వాత సినిమాకు ఓకే చెప్పే విధానం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఏ కథ విన్నా.. ముందు ఒక నటిగా కాకుండా తల్లిగా ఆలోచిస్తున్నాను. నా కొడుకు నీల్‌ పెద్దయ్యాక నేను నటించిన సినిమాలు చూసి "ఇది మా అమ్మ చేసిన గొప్ప సినిమా" అని గర్వంగా చెప్పుకునేలా ఉండాలి. అందుకే మంచి కథ, బలమైన పాత్ర, సమాజానికి ఉపయోగపడే సందేశం ఉన్న చిత్రాలకే ఓకే చెబుతున్నాను’ అని ఆమె చెప్పారు. ​ప్రస్తుతం తాను నటిస్తున్న 'ది ఇండియా స్టోరీ' సినిమాలో కల్తీ ఆహారం, వ్యవసాయంలో అధికంగా వాడుతున్న పురుగుమందుల వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న ప్రభావాన్ని చూపించారు. ఈ సినిమా ప్రభావంతో తాను తీసుకునే ఆహారంలోనూ, ముఖ్యంగా తన కొడుకు నీల్‌కు ఎలాంటి ఆహారం ఇవ్వాలి, ఏవి ఇవ్వకూడదనే విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టానని కాజల్ పేర్కొన్నారు. దర్శకుడు చేతన్ డీకే తెరకెక్కిస్తున్న 'ది ఇండియా స్టోరీ'లో కాజల్ ఓ పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో కనిపించనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్