శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికాలో హైబ్రిడ్ కార్లకు పెరిగిన డిమాండ్

2 గంటల క్రితం

car
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 10:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌ : ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో అమెరికాలో పెట్రోల్ ధరలు గ్యాలన్‌కు 4 డాలర్లకు చేరడంతో హైబ్రిడ్ కార్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. తగినన్ని హైబ్రిడ్ మోడళ్లు అందుబాటులో లేకపోవడంతో అమెరికన్ కొనుగోలుదారులు హ్యుందాయ్, కియా, టయోటా, హోండా వంటి ఆసియా బ్రాండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మూడో త్రైమాసికంలో కియా అమ్మకాలు 152 శాతం, హ్యుందాయ్ అమ్మకాలు 39 శాతం పెరగగా, ఇవిలపై పన్ను రాయితీ తొలగింపుతో టెస్లా విక్రయాలు 2 శాతం తగ్గాయి. కొరియా సంస్థలు సంయుక్తంగా 5,06,200 వాహనాలు విక్రయించాయి. కొత్త కార్ల విక్రయాల్లో సగానికిపైగా ఆసియా బ్రాండ్ల వాటా ఉండటం ఈ మార్పును సూచిస్తోందని ఎడ్మండ్స్ ఇన్‌సైట్స్ డైరెక్టర్ ఇవాన్ డ్రూరీ తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్