శనివారం, 03 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పరిశ్రమలే జాతి నిర్మాణకర్తలు

2 గంటల క్రితం

nara
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 11:32 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- తమ అభివృద్ధికి సహకరించండి

- పాన్‌ఐఐటి సమ్మిట్‌‌లో మంత్రి లోకేష్‌

‌ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వ్యవస్థాపకులు, పరిశ్రమలను తాము జాతి నిర్మాణకర్తలుగా భావిస్తున్నామని విద్య, ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ ‌శాఖల మంత్రి నారా లోకేష్‌ అన్నారు. విజయవాడలోని అంబేద్కర్‌ ‌కళావేదికలో జరిగిన పాన్ ఐఐటి సమ్మిట్ – 2026లో మంత్రి లోకేష్ మాట్లాడారు. తాము అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి తమ వంతు సహకారం అందించాలన్నదే ధ్యేయమన్నారు. ఎపిని అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చేందుకు తమ మంత్రివర్గ బృందం ఉమ్మడి లక్ష్యంతో పనిచేస్తోందని చెప్పారు. ప్రజలు తమకు ఇచ్చిన ఐదేళ్ల సమయంలోనే ఫలితాలు చూపించాలని చెప్పారు. ప్రాజెక్టులకు వాస్తవ రూపమిచ్చి, వాటి ద్వారా ఉద్యోగాలు సృష్టించాలనేది తమ తపన అనానరు.

రాష్ట్రాన్ని ప్రపంచ హార్టికల్చర్‌ ‌హబ్‌‌గా మార్చాలనే విజన్‌‌తో ముఖ్యమంత్రి ముఖేష్ అంబానీని ఒప్పించి రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేయించారని తెలిపారు. పరిశోధన నుంచి ప్రాసెసింగ్ వరకు, మెకనైజేషన్ నుంచి వినియోగదారుడికి నాణ్యమైన ఉత్పత్తి అందించడం వరకు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం వరకు మొత్తం వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమన్నారు.తాము ప్రస్తుతం 23 క్లస్టర్లను నిర్మిస్తున్నామని, ఇవి హార్టికల్చర్ నుంచి క్వాంటం వరకు విస్తరించాయని చెప్పారు. అగ్రికల్చర్, మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫార్మా, ఆటోమోటివ్, సిమెంట్, సోలార్, ఇంగోట్, వాఫర్ మ్యానుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ వంటి రంగాల్లో క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఐఐటి తిరుపతి ద్వారా యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ తో కలసి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సెంటర్ ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కోరారు. ప్రైవేట్ రంగాన్ని, ఐఐటి తిరుపతిని ఒకచోటికి తీసుకువచ్చి రీసెర్చిపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. ఇలాంటి విధానాన్ని 23 క్లస్టర్లలో అమలు చేస్తామన్నారు. అమరావతిని విద్య, పరిశోధన హబ్ గా తీర్చిదిద్దే దిశగా కూడా తాము ముందుకు వెళ్తున్నామన్నారు. వచ్చే దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని సాధించడానికి ఐఐటియన్ల మార్గదర్శకత్వం అవసరమని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్