మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆపిల్‌ కొత్త సిఇఒగా జాన్‌ టెర్నస్‌

31 ఆగస్టు, 2026

apple
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 12:35 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఇక ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌‌గా టిక్‌ కుక్‌

శాన్‌‌ఫ్రాన్సిస్కో : ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్‌లో చాలా ఏళ్ల తర్వాత అత్యంత కీలకమైన నాయకత్వ మార్పు చోటుచేసుకుంది. 2011 నుంచి కంపెనీ సిఇఒగా బాధ్యతలు నిర్వహిస్తున్న టిమ్ కుక్ సెప్టెంబర్ 1తో ఆ పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఇకపై ఆయన కంపెనీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగనున్నారు. ఆయన స్థానంలో ఆపిల్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జాన్ టెర్నస్ నూతన సిఇఒగా బాధ్యతలు చేపట్టనున్నారు. సిఇఒ హోదాలో రోజువారీ నిర్వహణ బాధ్యతల నుంచి టిమ్ కుక్ తప్పుకున్నప్పటికీ, కంపెనీ వ్యూహాత్మక వ్యవహారాల్లో ఆయన పాత్ర కొనసాగనుంది. ముఖ్యంగా అమెరికా ప్రభుత్వం, వైట్ హౌస్, అలాగే చైనా ప్రభుత్వంతో యాపిల్‌కు ఉన్న దౌత్యపరమైన సంబంధాల నిర్వహణలో ఆయన కీలకంగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఆపిల్ వాణిజ్య విధానాలు, కఠిన నిబంధనలు, సరఫరా వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో కుక్ అనుభవం కంపెనీకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. గత 20 ఏళ్లకు పైగా ఆపిల్‌లో సేవలందిస్తున్న జాన్ టెర్నస్.. 2021 నుంచి హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగానికి నాయకత్వం వహిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్