గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఓటీటీ నుంచి సట్లజ్‌ తొలగింపు​

1 రోజు క్రితం

satjal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 08:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రముఖ నటుడు, గాయకుడు దిల్జీత్‌ దోసాంజ్‌ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్‌ చిత్రం 'సట్లజ్‌'. దాదాపు మూడు, నాలుగేళ్లుగా విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు జూలై 3న జీ5లో విడుదలైంది. అయితే, విడుదలైన 48 గంటల్లోనే ప్రస్తుత పరిస్థితుల కారణంగా చిత్రాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ప్రకటించింది. మళ్లీ చిత్రాన్ని అందుబాటులోకి తేవడానికి చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తున్నామని, పైరసీకి మద్దతు ఇవ్వొద్దని ఓ ప్రకటనలో తెలిపింది.
పంజాబ్‌కు చెందిన హ్యూమన్‌ రైట్స్‌ కార్యకర్త జస్వంత్‌ సింగ్‌ ఖల్రా జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో ఇందిరా గాంధీ హత్య అనంతర సిక్కు వ్యతిరేక అల్లర్లు, పోలీసులు సాగించిన దమనకాండకు వ్యతిరేకంగా జస్వంత్‌ చేసిన పోరాటాన్ని దర్శకుడు హనీ ట్రెహాన్‌ చూపించారు. అలాగే ఆయన హత్యకు సంబంధించిన కీలక అంశాలను కూడా చిత్రంలో ప్రస్తావించారు. దేశ భద్రత, సార్వభౌమత్వానికి భంగం కలిగించే అవకాశం పేరిట కేంద్ర ప్రభుత్వం ఈ చిత్రాన్ని తొలగించాలని జీ5ను ఆదేశించింది. దీంతో ఓటీటీ వేదిక నుంచి చిత్రాన్ని తొలగించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్