ఆదివారం, 12 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ధనుష్-వెట్రిమారన్ కాంబోలో 'తమిళ్ మురుగన్'

1 రోజు క్రితం

murugan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 07:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

స్టార్ హీరో ధనుష్, డైరెక్టర్ వెట్రిమారన్ కాంబోలో గతంలో వచ్చిన ‘పొల్లాదవన్’, ‘ఆడుకాలం’, ‘వడ చెన్నై’, ‘అసురన్’ సినిమాలు హిట్ అయ్యాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా టైటిల్ 'తమిళ్ మురుగన్`గా ఖరారు చేసినట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ ప్రోమో కూడా విడుదలైంది. ప్రముఖ రచయిత అరివుమతి రాసిన పుస్తకం, సంగం సాహిత్యంలో నమోదైన తమిళ మురుగన్ చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ధనుష్ తన సొంత బ్యానర్ ‘వుండర్‌బార్ ఫిల్మ్స్’ తో పాటు ‘ప్రొడక్షన్ మైల్స్ టు గో’ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్