బుధవారం, 16 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionరూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరి..!

14 గంటల క్రితం

sensex
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 16, 2026, 12:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లలో మంగళవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఉదయం ఆశాజనకంగా ప్రారంభమైన దలాల్‌ ‌స్ర్టీట్‌.. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఊహించని రీతిలో కుప్పకూలింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న బాండ్ల రాబడులు, ముడి చమురు ధరల భయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపరుల విశ్వాసం తీవ్రంగా దెబ్బతింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ ఒక శాతానికి పైగా నష్టపోయి భారీ పతనాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి ఏకంగా 1,433 పాయింట్లు కోల్పోయి.. చివరికి 778 పాయింట్లు నష్టపోయి 74,004కు పరిమితమయ్యింది. అదే బాటలో నిఫ్టీ సైతం రోజంతా సాగిన ఒడుదొడుకుల మధ్య ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి 474 పాయింట్లు పడిపోయి.. 279 పాయింట్లు నష్టపోయి 23,118 వద్ద ముగిసింది. ఈ భారీ పతనం కారణంగా బిఎస్‌ఇలో నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.9 లక్షల కోట్లకు పైగా ఆవిరైపోయి రూ.472 లక్షల కోట్లకు పడిపోయింది. అమెరికాలో 10 ఏళ్ల ట్రెజరీ బాండ్ రాబడులు 2023 తర్వాత తొలిసారిగా 5 శాతం మైలురాయిని దాటడం. ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందనే అంచనాలతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత కాలం పాటు ఎక్కువగానే ఉంచవచ్చనే ఆందోళనలు దీనికి కారణం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్