గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలలో చాగల్లు విద్యార్థులకు రజితం

2 రోజుల క్రితం

Chagallu students win silver in state-level football competitions.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 12:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : ఈ నెల 3 నుండి 5వ తేదీ వరకు నంద్యాలలో జరిగిన అండర్ 13 రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ పోటీలలో చాగల్లు విద్యార్థులు .డి.జయదుర్గ, కౌసల్య, ఎస్.యామిని, ఎస్.పావని, కే.అనుషాలు పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనబరిచి రజిత పతకాన్ని సాధించారని పిడి విజయలక్ష్మి మంగళవారం ప్రజాశక్తికి తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు అలాగే వారి తల్లిదండ్రులను, ప్రధాన ఉపాధ్యాయురాలు ఎస్ వాసవి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఆర్వి ప్రసాద్ , గంగాధర్ , ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులను గ్రామస్తులు, ఎస్ఎంసి సభ్యులు నందిని అభినందించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్