మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

సీనియర్ కమ్యూనిస్ట్ కామ్రేడ్ షడ్రక్ మృతి

21 జులై, 2026

Death of senior Communist Comrade Shadrach
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 02:48 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జెండా కప్పి నివాళులర్పించిన సిపిఎం నాయకులు


ప్రజాశక్తి - రెడ్డిగూడెం (ఎన్టిఆర్) : రెడ్డిగూడెం మండలం, కూనపరాజుపర్వ గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ సీనియర్ నేత కామ్రేడ్ కొక్కెరగడ్డ షడ్రక్ (93) వృద్దాప్యం వలన సంభవించిన అనారోగ్యంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు మృతి చెందారు. విషయం తెలుసుకున్న రెడ్డిగూడెం మండల సిపిఎం నాయకులు మద్దిరెడ్డి మాధవరెడ్డి, ఉయ్యూరు కృష్ణారెడ్డి, పాములపాటి సత్యనారాయణ రెడ్డి, వెంకటేశ్వర్రావు తదితరులు కూనపరాజుపర్వ గ్రామానికి వెళ్లి షడ్రక్ మృతదేహంపై సిపిఎం పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. ఉమ్మడి కమ్యునిష్టు పార్టీ విడిపోయిన సమయంలో షడ్రక్ సిపిఎం పార్టీ లో కొనసాగుతూ చనిపోయే వరకు అదే పార్టీ లో కొనసాగారని నేతలు స్మరించుకున్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమంలో నాయకులతోనే ఉన్నారు. షడ్రక్ క్ కు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్