ఎచ్చెర్ల (శ్రీకాకుళం) : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పరీక్షా విధానంపై ఉద్యమకారులతో తక్షణమే చర్చించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు సి.హెచ్.అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. విద్యావేత్త, విద్యా కార్యకర్త సోనమ్ వాంగుచుక్ కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ... నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడైన దీక్ష భగ్నం చేయడాన్ని నిరసిస్తూ సిపిఐ(యం) ఆధ్వర్యంలో ఎచ్చెర్లలో సోమవారం ప్రదర్శన నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ .... కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి నిరంకుశ చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. ఉద్యమకారులతో కనీసం చర్చలకు సిద్ధపడకుండా దేశ పరీక్షల వ్యవస్థ, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురాకుండా 21 రోజుల దీక్షను భగ్నం చేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి : సిపిఐ(యం) నిరసన ధర్నా
17 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 20, 2026, 01:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)