విశాఖ : ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (AILRSA),సౌత్ కోస్ట్ రైల్వే ఆధ్వర్యంలో మొట్టమొదటి జోనల్ మహాసభ (Maiden Zonal Conference) శుక్రవారం ఉదయం 10 గంటలకు విశాఖపట్నంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రం, దాబాగార్డెన్స్ లో ఘనంగా జరిగింది. ఈ మహాసభలో రైల్వే లోకో రన్నింగ్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, భద్రత, పని గంటలు, సిబ్బంది కొరత, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, తదితర కీలక అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించనున్నారు.

ప్రధాన డిమాండ్లు ....
సైన్-ఆన్ నుండి సైన్-ఆఫ్ వరకు విధి గంటలను 8 గంటలకు పరిమితం చేయాలి.
36 గంటల్లోపు హెడ్‌క్వార్టర్స్‌కు తిరిగి చేరేలా విధానాన్ని అమలు చేయాలి.
వారానికి రెండు రాత్రులకే నిరంతర నైట్ డ్యూటీలను పరిమితం చేయాలి.
46 గంటల వారాంత విశ్రాంతి (30+16 గంటలు) కల్పించాలి.
రన్నింగ్ అలవెన్స్‌ను RAC-1980 సూత్రాల ప్రకారం సవరించాలి.
పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరించాలి.
నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించాలి.
ALP, LP(G), LP(S), LP(P), LP(M) తదితర ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి.
ఈ మహాసభకు AILRSA జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కె.సి. జేమ్స్, జాతీయ అధ్యక్షులు కామ్రేడ్ ఆర్.ఆర్. భగత్, మాజీ ఎమ్మెల్సీ కామ్రేడ్ ఎం.వి.ఎస్. శర్మతో పాటు పలువురు ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు హాజరై ప్రసంగించారు.









కామెంట్‌లు (0)