ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికాతో స్వేచ్చా వాణిజ్య ఒప్పందం వద్దు : ఎపి రైతు, కౌలు రైతు, వ్య.కా.స, కార్మిక, సిఐటియు

4 రోజుల క్రితం

No Free Trade Agreement with the USA: AP Farmers, Tenant Farmers, Agricultural Workers' Unions, Labor Unions, and CITU.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 11:36 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం వద్దు అని కోరుతూ ఢిల్లీ బయలుదేరిన రైతులను అడ్డుకోవడం చాలా అన్యాయం


పార్వతీపురం (మన్యం) : పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండల కేంద్రంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం కౌలు రైతుల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు మాట్లాడుతూ .... అమెరికాతో మన దేశం స్వేచ్చా వాణిజ్య ఒప్పందం వద్దు అని కోరుతూ నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని, ఇలాంటి సందర్భంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందానికి సిద్ధమవుతుందని ఆ ఒప్పందం జరిగితే అమెరికా నుండి పన్నులు లేకుండా వచ్చే నౌక దిగుమతుల వల్ల మన రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆ ప్రభావంతో పొగాకు మొక్కజొన్న మామిడి పత్తి తదితరి పంటలు ధరలు పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇలాంటి సందర్భంలో అగ్రిమెంట్లు అమల్లోకి వస్తే ఆహారాన్ని ఇచ్చే పంటలు పండించే 11 కోట్ల మంది రైతులు ఎనిమిది కోట్ల మంది పాడి రైతులు పూర్తిగా దివాలా తీసే పరిస్థితి కనిపిస్తుందని వివరించారు. కాబట్టి స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయవద్దని కోరుతూ గ్రామ గ్రామాన రైతులతో వ్యవసాయ కార్మికులతోనూ సంతకాలు చేయించి రాష్ట్రపతికి పంపించాలని ప్రతి మండలములో నిరసన ప్రదర్శనలు చేయాలని అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రంపు మోడీల దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని ఎస్ కె ఎం ఇచ్చిన పిలుపుమేరకు ... ఈరోజు పాలకొండ మండల కేంద్రంలో రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు ఢిల్లీలో జరిగే నిరసన కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన రైతులను అడ్డుకోవడం తగదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇంకా రైతులందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని రైతు సంఘాలు హెచ్చరించాయి. ఈ కార్యక్రమంలో సిహెచ్ సురేష్ పామోటి సంగమేశ్ జె శ్రీను బి శివ కే సూర్యరావు ఎం రమణ పి రామినాయుడు తదితరులు పాల్గొన్నారు.


డిమాండ్లు ..

  • అన్ని పంటలకు సి20 ప్లస్ 50 మద్దతు ధర గ్యారెంటీ చట్టం తేవాలి

  • రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల రుణాలు వెంటనే రద్దు చేయాలి

  • పేద, మధ్య తరగతి రైతులకు కౌలు రైతులకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మికులకు పదివేల రూపాయలు పెన్షన్ వెంటనే అందించాలి

  • నాలుగు లేబర్ కోడ్లను ఉపసహరించాలి

ఎపి రైతు సంఘం



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్