మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అధికారులు కాస్త పట్టించుకోండి.. మహిళలకు అన్యాయం చేస్తున్న పోలీసులు !

6 గంటల క్రితం

Officials, please pay some attention—police are treating women unfairly!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 11:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : నియోజకవర్గం వర్గంలో మహిళా ప్రజా ప్రతినిధి ఉన్నప్పటికీ మహిళలకు అన్యాయమే చేస్తున్న పోలీసులు అని మహిళలు మైనర్ బాలికల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకెళితే మండలంలోని పలు గ్రామాలలోని మహిళలు పైన మైనర్ బాలికలపైన దాడులు జరుగుతున్నప్పటికీ, మహిళలు మైనర్ బాలికలు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని మహిళలు, మైనర్ బాలికల తల్లిదండ్రులు వాపోతున్నారు. మంగళవారం వారంతా ప్రజాశక్తితో తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్కూళ్లల్లోకి పోయి సీఐ సత్య బాబు ఎస్ఐ సురేంద్రబాబు పోలీస్ చట్టాల గురించి, పోలీసులు విధించే సెక్షన్ల గురించి విద్యార్థినిలకు వివరిస్తారని, ఎవరైనా మైనర్ బాలికపై తమ పిల్లల పైన ఫలానా వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడని చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే మాత్రం పుట్లూరు పోలీస్ చట్టాలు, వాటికి సంబంధించిన సెక్షన్లు మాయమైపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లు చెప్పినట్లు వింటేనే తమకు న్యాయం చేస్తాం లేకపోతే మీ ఇష్టం అని మైనర్ బాలికల తల్లిదండ్రులను పోలీసులు బెదిరించి, భయభ్రాంతులకు గురి చేసి వారికి నచ్చిన విధంగా చెప్పించుకుని వీడియోలు తీసుకొని పై అధికారులకు తెలియజేస్తున్నారని వివరించారు. పోలీసులకు చట్టాలు ఉన్నది చెప్పడం వరకేనా ? వాటిని ఏమాత్రం ఉపయోగించడం లేదని మహిళలు, మైనర్ బాలికల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మహిళలు సైతం గత నెల కిందట పుట్లూరికి వచ్చిన ఎస్పీ ని కలిసి పుట్లూరు పోలీసులు మహిళలపై అన్యాయం జరుగుతున్న పట్టించుకున్న పాపాన పోలేదని ఫిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఎస్పీ సీఐ, ఎస్ఐలను పిలిచి వారికి నాలుగు రోజుల లోపల న్యాయం చేయాలని చెప్పినా కూడా ఎస్పీ చెప్పినా కూడా సిఐ,ఎస్ఐ న్యాయం చేయలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి కేసులు నీరుగార్చకుండా తమకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్