శుక్రవారం, 10 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

అర్హులు ఓటును కోల్పోవద్దు..

2 గంటల క్రితం

Eligible voters should not lose their vote.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 10, 2026, 02:22 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • సర్ ప్రక్రియపై నిర్లక్ష్యం వీడాలి..

  • జూలై 14 తుది గడువు.

  • నగరంలో సర్ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్


ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ : క్షేత్రస్థాయిలో సర్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ -2026 ప్రక్రియను శుక్రవారం నగరంలోని వివిధ ప్రాంతాలలోని సచివాలయాల్లో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిషన్ జస్వంత్ రావు పాల్గొన్నారు. సచివాలయాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వార్డులలో విధులునిర్వర్తిస్తున్న బిఎల్ ఓ లపనితీరునుపరిశీలించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని బిఎల్ఓలు బిఎల్ఎలతో మాట్లాడుతూ ఈనెల 14 సర్ ప్రక్రియ తుది గడువు ముగుస్తుందని అందువల్ల ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా సమన్వయంతో ఈ ప్రక్రియను వేగవంతంగా గడువులోగా పూర్తిచేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రస్తుతం తమ సొంత ఊరిలో అందుబాటులో లేని వారు ఇటీవల ఇల్లు మారిన కుటుంబాలు లేదా ఓటర్ లిస్ట్ లో పేరు లేదని ఆందోళన చెందుతున్న అర్హులైన ఓటర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకునే విధంగా అవసరమైన మేరకు చర్యలు తీసుకొని తగిన సమాచారాన్నిఅందించి అలాంటి వారిని గుర్తించి పూర్తి వివరాలతో ఆన్లైన్ లో ఎన్యుమరేషన్ చేయాలని తెలిపారు. సర్ ప్రక్రియపై ప్రజలు నిర్లక్ష్యం వీడాలని అర్హులుఎట్టిపరిస్థితుల్లోనూ ఓటు కోల్పోద్దని ఈ ప్రక్రియపై అవగాహన కలిగి తమఓటునుకాపాడుకోవాలని వెంటనే ఆన్ లైన్ ఎన్యుమరేషన్ లో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అనంతపురం నగరంలోని 45 వార్డ్ పరిధిలో ఉన్న 168 ,169, 170 , 171 పోలింగ్ కేంద్రాల ఓటర్లను కలిసి సర్ వివరాలనుఅడిగితెలుసుకున్నారు. అలాగే ఆయా సచివాలయాన్ని సందర్శించి ప్రత్యేక సమగ్ర సవరణప్రక్రియసమర్థవంతంగా వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటివరకు నమోదవుతున్న వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బిఎల్ఎ లతో పాటు ఇతర ఉద్యోగ సిబ్బందిని మరింతగా ఏర్పాటుచేసి ప్రత్యేకసమావేశం నిర్వహించి రెండు రోజుల్లోగా పూర్తిస్థాయిలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ జస్వంత్ రావు ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా గడువులోగా బిఎల్ఓ లతో ఆన్లైన్ నమోదు, మరణించిన వారు లేక శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారు, ద్వంద నమోదు లు ఇతరులుగా గుర్తించిన వివరాలు లాంటి అంశాలలో సహకరించి పారదర్శకంగా సవరణల ప్రక్రియను జిల్లా ప్రజలు, డివిజన్ స్థాయి అధికారులు ఉద్యోగసిబ్బందిసమన్వయంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో బిఎల్ ఓ లు జ్యోత్స్న, కృష్ణవేణి ,శ్రావణి, బి ఎల్ ఏ నాగభూషణం వివిధ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్