ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

యుపిఎస్‌సి ఫలితాల్లో "పులివెందుల ఫుడ్ టెక్నాలజీ కళాశాల" విద్యార్థినికి మొదటి ర్యాంక్

14 జులై, 2026

pulivendula
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 03:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- పులివెందుల రూరల్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) ప్రిలిమినరీ పరీక్షా ఫలితాల్లో పులివెందుల ఫుడ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన విద్యార్థిని చింతా శ్రీలేఖ ఆల్‌ ఇండియా మొదటి ర్యాంక్‌ సాధించింది. సోమవారం విడుదలైన యుపిఎస్‌సి ప్రిలిమినరీ పరీక్షా ఫలితాల్లో చింతా శ్రీలేఖ ఆల్‌ ఇండియా మొదటి ర్యాంకు సాధించారని పులివెందుల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎమ్. మాధవ మంగళవారం ఒక ప్రకటన తెలిపారు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (ఎమ్.ఎస్.ఎం.ఈ) మంత్రిత్వ శాఖకు సంబంధించిన డెవలప్మెంట్ కమిషనర్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ (ఇండియన్ ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ సర్వీస్ - ఆహార విభాగం) ఉద్యోగానికి ఎంపికైందని అన్నారు. విద్యార్థిని సాధించిన విజయం పులివెందుల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలకు, ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థిని చింతా శ్రీలేఖ ను, అసోసియేట్ డీన్ డాక్టర్ ఎమ్. మాధవ ప్రత్యేకంగా అభినందించారు. అంకితభావం గల అధ్యాపకులు, తరగతుల బోధన, అత్యాధునిక ప్రయోగశాలలు పులివెందుల ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఉండడం వలన ఈ విజయం సాధ్యమైందని అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్