ప్రజాశక్తి-పలమనేరు (చిత్తూరు) : చిత్తూరు జిల్లా పలమనేరులోని వ్యవసాయ మార్కెట్ వద్ద శుక్రవారం ఉదయం 11 గంటలకు మూకుమ్మడిగా టమోటా రైతులందరూ రోడ్డుపై కూర్చొని నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టమోటా రైతులు మాట్లాడుతూ ... తమ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని, టమాటా ధరలు భారీగా పతనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ముఖ్య కారణం వ్యాపారులు దళారీలు, వ్యవసాయ మార్కెట్ అధికారులు సిండికేట్ కావడమేనని ఆరోపించారు. బయట మార్కెట్లో టమోటా ఎక్కువ రేట్లు పలుకుతుండగా పలమనేరులో మాత్రం భిన్నముగా, అతి దారుణంగా టాప్ రేటు 100 రూపాయలకు మించడం లేదని, టమాటా కోసిన కూలీలు, రవాణా ఖర్చులకు కూడా చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే రైతులు చావడం తప్ప బతకడం ఎలాగా ? అని ప్రశ్నించారు. మార్కెట్ చైర్మన్ రాజన్న ఏమాత్రం రైతుల గురించి పట్టించుకోలేదని ఏ ఒక్కరోజు గాని మార్కెట్లో ప్రవేశించి పర్యవేక్షించలేదని మార్కెట్ చైర్మన్ రాజన్న డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఒకటిన్నర గంట పాటు భారీగా రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోయినది. అనంతరం మార్కెట్ కమిటీ సెక్రటరీ సంజీవ్ కుమార్ రైతులతో సంప్రదించి జరిపిన చర్చల ఫలితంగా రైతులు తమ నిరసనను విరమించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.
రోడ్డెక్కిన టమోటా రైతులు
6 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 03, 2026, 12:47 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)